Current Affairs Today in Telugu July 2024

Current Affairs today in Telugu July 2024

సోమవారం, 1 జులై , 2024:

జాతీయ కరెంటు అఫైర్స్:

1.కృష్ణానది యాజమాన్య బోర్డ్ చైర్మన్‌గా అతుల్ జైన్‌ను నియమిస్తున్నట్టు కేంద్ర జలశక్తి శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

2. ఇండియన్ ఆర్మీ చీఫ్ లెఫ్ట్నెంట్ గా జనరల్ ద్వివేది నియమితులయ్యారు.

3. నేవీ చీఫ్ అడ్మిరల్ గా దినేష్ త్రిపాటి భారత నౌకాదళ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

4. గణాంకాలు మరియు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ (MOSPI) eSankhyiki పోర్టల్‌ను 30 జూన్ 2024న ప్రారంభించింది.అధికారిక గణాంకాల కోసం భారతదేశం యొక్క కొత్త డేటా హబ్, అందరికీ యాక్సెస్ మరియు విశ్లేషణను మెరుగుపరచడానికి ప్రారంభించబడింది.
2024 థీమ్: ‘నిర్ణయం తీసుకోవడానికి డేటాను ఉపయోగించడం.’

5. ప్రతి సంవత్సరం జూలై 1న వస్తువులు మరియు సేవల పన్ను (GST) దినోత్సవాన్ని పాటిస్తారు.

6. CA డే ప్రతి సంవత్సరం జూలై 1 న జరుపుకుంటారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాను (ICAI) 76 వ వార్షికోత్సవాన్ని సూచిస్తుంది.

7. టాటా గ్రూప్ US$28.6 బిలియన్ల వద్ద భారతదేశపు అత్యంత విలువైన బ్రాండ్‌గా తన స్థానాన్ని నిలుపుకుంది, US$30 బిలియన్ల మార్కుకు చేరువైంది. ఇన్ఫోసిస్ రెండో స్థానంలో నిలవగా, హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్ మూడో స్థానానికి చేరుకుంది.

8. భారతదేశంలో వెల్లుల్లిని అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం మధ్యప్రదేశ్. దీని ఉత్పత్తి సామర్థ్యం 2,016.13 మెట్రిక్ టన్నులు .

9. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తదుపరి చైర్మన్‌గా చల్లా శ్రీనివాసులు సెట్టిని ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇనిస్టిట్యూషన్ బ్యూరో (FSIB) ఎంపిక చేసింది.

10.భారతదేశంలో, ప్రతి సంవత్సరం జూలై 1వ తేదీన జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జరుపుకుంటారు.

11.భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు జీవితం మరియు ప్రయాణంపై మూడు పుస్తకాలను ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 30న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విడుదల చేశారు.

 

తెలంగాణా కరెంటు అఫైర్స్:

1.తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రాసిక్యూషన్ విభాగం ప్రత్యేకంగా ‘సమాహారం’ పేరిట కొత్త క్రిమినల్ చట్టాలపై సమగ్ర సమాచారంతో యాప్‌ను రూపొందించింది.

 

స్పోర్ట్స్ కరెంటు అఫైర్స్:

1.టీమ్ ఇండియా టీ 20లో విజయం సాదించినందుకుగాను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) నుండి 2.45 మిలియన్ డాలర్లు (సుమారు రూ.20.42 కోట్లు) అందుకుంది. రన్నరప్ దక్షిణాఫ్రికా $1.28 మిలియన్ (సుమారు రూ.10.67 కోట్లు) సాధించింది.

2. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలు అంతర్జాతీయ T 20 నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు.

3. 2024, పురుషుల T20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాపై భారత్ ఏడు పరుగుల తేడాతో విజయం సాధించిన తర్వాత విరాట్ కోహ్లీ T20 లకు రిటైర్మెంట్ ప్రకటించాడు.

 

అంతర్జాతీయ కరెంటు అఫైర్స్:

1. బంగ్లాదేశ్ నేవీ 29 జూన్ 2024న భారతదేశం యొక్క గార్డెన్ రీచ్ షిప్‌బిల్డింగ్ మరియు ఇంజనీర్స్ (GRSE)తో ‘మేడ్ ఇన్ ఇండియా’ 800-టన్నుల ఓషన్ గోయింగ్ టగ్ కోసం ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందం బంగ్లాదేశ్‌కు భారతదేశం యొక్క డిఫెన్స్ లైన్ ఆఫ్ క్రెడిట్‌లో భాగం .

 

 

ఆంధ్ర ప్రదేశ్ కరెంటు అఫైర్స్:

 

 

వివిధ పత్రికల్లో ఛానల్ లలో వచ్చిన సమాచారం సేకరించి ఇక్కడ ఉంచడమైనది. ఏమన్నా తప్పులు ఉండివుంటే మెసేజ్ ద్వారా సూచించగలరు.

 

 

 

Current Affairs Today in Telugu June 2024

Indian constitution New challenges Notes With Questions and Answers

“Distinctive Features of Indian Federalism: Student-Friendly Question & Answers”

What are Fundamental Duties class 9-Question and Answers

What do you mean by Directive Principles of State Policy?

Understanding Fundamental Rights in the Indian Constitution – Exam Study Material

“Tribute to Sarvepalli Radhakrishnan: The Philosopher-President Who Shaped India’s Future”

What is India’s uniform civil code? History of Uniform Civil Code India and Questionnaire

“India’s G20 Leadership 2023: One Earth, One Family, One Future | G20 Summit, Sustainable Development Goals, Climate Finance, Women Empowerment”

7th schedule of constitution of India