Current Affairs today in Telugu June 2024

Current Affairs today in Telugu June 2024

ఆదివారం, 30 జూన్, 2024:

జాతీయ కరెంటు అఫైర్స్:

1.రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(RPF) వారు ‘సాంగ్యాన్’ అనే లీగల్ గైడ్ యాప్‌ను తీసుకువచ్చారు.
అమలులోకి వచ్చిన 3 కొత్త చట్టాలు (ఇవి జులై 1 నుండి అమలులోకి రానున్నాయి)
1. భారతీయ న్యాయ సంహిత (BNS )
2. భారతీయ నాగరిక్ సంరక్ష సంహిత (BNSS )
3. భారతీయ సాక్ష్య అధినియం (BSA )
వీటిని ఐపీసీ, సీఆర్పిసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ చట్టాల స్థానంలో తీసుకువచ్చారు.

2. వాణిజ్య బ్యాంకుల మొండి బకాయిలు లేదా స్థూల నిరర్ధక ఆస్తులు గత ఆర్థిక సంవత్సరం (2023-24) చివరకు 12 ఏళ్ల కనిష్టమైన 28 శాతానికి పరిమితమయ్యాయి. ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 2024, జూన్ 27న విడుదల చేసిన ఆర్ధిక స్థిరత్వ నివేదిక (ఎఫ్ఎస్ ఆర్) తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) ముగిసే నాటికి ఇవి 2.5 శాతానికి దిగివస్తాయని అంచనా వేసింది.

3. ఇండియన్ ఎయిర్ ఫోర్స్(IAF) వారు ‘ఎక్ససైజ్ తిరంగ్ శక్తి ని’ ఆగస్టు-సెప్టెంబర్‌లో రెండు విడతల్లో నిర్వహించబోతుంది.

4. ‘ఎడ్ ఫైండ్ ఎ హోమ్’ చిన్నపిల్లల కామిక్ బుక్ రచయిత్రి ఆలియా భట్.

5. 2023లో సైబర్ మోసాల వల్ల  భారత్ లోని వినియోగదారులు రూ.7,489 కోట్లు పోగొట్టుకున్నారని జాతీయ నేర గణాంక సంస్థ (NCRB) నివేదిక పేర్కొంది.

6. ప్రస్తుతం జాతీయ భద్రత ఉపసలహాదారుడుగా ఉన్న విక్రమ్ మిస్త్రి విదేశీ వ్యవహారాల శాఖ నూతన కార్యదర్శిగా నియమితులయ్యారు.

7. కృత్రిమ మేధ ఆధారంగా రహదారుల భద్రతను పెంపొందించడానికి ‘National Highway Authority of India'(NHAI ) మరియు ‘ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ’ మధ్య ఒప్పందం జరిగింది.

8. ఆర్థిక శాఖ గణాంకాల ప్రకారం మార్చి 24 చివరికల్లా కేంద్రప్రభుత్వం అప్పులు రూ. 171.78 లక్షల కోట్లు పెరిగాయని త్రైమాసిక నివేదిక(జనవరి -మార్చి 2024) పేర్కొంది. డిసెంబర్ చివరిలో రూ. 166.14 లక్షల కోట్లుతో పోలిస్తే ఇది 3.4 % అధికమని పేర్కొంది .

తెలంగాణా కరెంటు అఫైర్స్:

1.తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హరితహారం స్కీం పేరును ‘వన మహోత్సవం’ గా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

2. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ డీ శ్రీనివాస్ కన్నుమూశారు.

 

స్పోర్ట్స్ కరెంటు అఫైర్స్:

1.కామన్వెల్త్ కథానికల పోటీలో  సంజనా ఠాకుర్ (28) ప్రధమ బహుమతి గెలుచుకున్నారు. ఈ పోటీలో ప్రపంచవ్యాప్తంగా 7,350 మంది పాల్గొన్నారు. ఆమెకు 5,000 పౌండ్ల నగదు లభిస్తుంది.

2. 2007 తర్వాత 2వ సారి 2024లో భారత్ దక్షిణాఫ్రికాపై 7 పరుగుల తేడాతో ICC T20 వరల్డ్ కప్ ను సొంతం చేసుకుంది.

3. 2024, పురుషుల T20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాపై భారత్ ఏడు పరుగుల తేడాతో విజయం సాధించిన తర్వాత విరాట్ కోహ్లీ T20 లకు రిటైర్మెంట్ ప్రకటించాడు.

4. ICC T20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ ఇది తన చివరి అంతర్జాతీయ ఫార్మాట్‌ గా ప్రకటించాడు.

 

శనివారం, 22 జూన్, 2024:

అంతర్జాతీయ కరెంటు అఫైర్స్:

1. అమెరికాకు చెందిన పరిశోధన సంస్థ హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ (హెచ్ఐ), యుని సెఫ్ సంయుక్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాయుకాలుష్య ప్రభావంపై 2024, జూన్ 19న నివేదిక విడుదల చేసింది. 2021లో ప్రపంచవ్యాప్తంగా సంభవించిన మరణాల్లో 12% దీనివల్లేనని నివేదిక వెల్లడించింది. 2021లో వాయు కాలుష్యంతో భారత్లో అయిదేళ్లలోపు చిన్నారులు 1,69,400 మంది ప్రాణాలు కోల్పోయారు.

2. తజకిస్తాన్ హిజాబ్ ఆచారాన్ని నిషేధించింది.

3. దక్షిణాఫ్రికాలోని నమాక్వాలాండ్‌లో, హ్యూవెల్ట్జీలు 13,000-34,000 సంవత్సరాల నాటి టెర్మైట్ మట్టిదిబ్బలు, భూమిపై ఎక్కువ కాలం నివసించే చెదపురుగుల గృహాలు.

4. అస్సాంలోని నీలచల కొండపై ఉన్న శక్తి పీఠం కామాక్షి ఆలయంలో వార్షిక అంబుజీ మేళ ప్రారంభమైంది.

5. ప్రపంచ శరణార్థుల దినోత్సవం (జూన్ 20): థీమ్ “ఫర్ ఏ వరల్డ్ వేర్ రేఫుజీస్ ఆర్ వెల్కమ్డ్ “.

6. శాస్త్రవేత్తలు బాలోన్ అనే ప్రోటీన్‌ను కనుగొన్నారు, ఇది పరిస్థితులు మరింత దిగజారినప్పుడు ప్రోటీన్ ఉత్పత్తిని రివర్స్‌గా ఆపడం ద్వారా బ్యాక్టీరియాను నిద్రాణస్థితికి మరియు పునరుద్ధరించడానికి అనుమతిస్తుంది.

7. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను మెరుగుపరచడానికి ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ భారతదేశానికి $170 మిలియన్ రుణం ఇచ్చింది. (జూన్ 19)

8. గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ ఫెసిలిటీ యొక్క 67వ సమావేశం, 34 అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ ప్రాజెక్టులకు $736.4 మిలియన్లను ఆమోదించింది.

9. ఆల్ఫాఫోల్డ్ అనే కొత్త టూల్ ప్రోటీన్ల నిర్మాణాలను వేగంగా అంచనా వేయగలదు. దీని వల్లవైద్యం, వ్యవసాయ రంగం తో పాటు ఇతర రంగాలలో జీవ పరిశోధనలు చాలా వేగంగా జరుగుతాయి.

10. వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) జూన్ 19, 2024న గ్లోబల్ ఎనర్జీ ట్రాన్స్ మిషన్ ఇండెక్స్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం, భారతదేశం గ్లోబల్ ఎనర్జీ రంగంలో పెద్ద ఎత్తున అభివృద్ధి సాధించింది. 120 దేశాల జాబితాలో 67వ స్థానం నుండి 63వ స్థానానికి ఎగబాకింది. స్వీడన్ మొదటి స్థానంలో కొనసాగుతోంది.

11. హెలికాప్టర్ తో లక్షలాది మగ దోమలను విడుదల చేసిన అమెరికాలోని హవాయి రాష్ట్రం.

 

జాతీయ కరెంటు అఫైర్స్:

1. గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ ఇండియా సుజ్లాన్ గ్రూప్ వైస్-ఛైర్మెన్ గిరీష్ తంతి ఛైర్మన్‌గా నియమితులైనట్లు గ్లోబల్ విండ్ డే (జూన్ 17) సందర్బంగా ప్రకటించింది.

2. అమల్లోకి వచ్చిన పేపర్ లీకేజ్ నిషేధ చట్టం జూన్ 22 ,2024.

3. ‘హేమిస్ శేచు ఫెస్టివల్’ లడక్ కేంద్రపాలిత ప్రాంతంలో బుద్ధిష్ట్ ఫెస్టివల్.

4. జమ్మూ & కాశ్మీర్‌లోని చీనాబ్ వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనపై రైలును భారతీయ రైల్వే విజయవంతంగా పరీక్షించింది. (జూన్ 20)

5. 2011 భరతనాట్యంలో పద్మ భూషణ్ గ్రహీత ప్రొఫెసర్ సివి చంద్రశేఖర్ కన్నుమూశారు.

6. పక్షవాతం విరుగుడును అమెరికాలోని ఓహాయ్ స్టేట్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు గుర్తించారు.

7. భారత్ లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఎఎల్) తయారు చేసిన రెండు ‘డోర్నియర్ 228 ఎయిర్ క్రాఫ్ట్’లను కొనుగోలు చేసేందుకు గయానా ఇటీవల ఒప్పందం చేసుకుంది.

8.ప్రసార భారతి నూతన ఛైర్మన్ గా నవనీత్ కుమార్ సెహగల్ నియమితు లయ్యారు.

9. మిషన్ పామ్ ఆయిల్’ కార్యక్రమంలో భాగంగా దేశంలో మొదటి ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ మిల్లును అరుణాచల్ ప్రదేశ్ ప్రారంభించింది.

10. భారత్ కు చెందిన నుమాలిగర్ రిఫైనరీ లిమి టెడ్ (ఎన్ఆర్ఎల్) తన మొదటి అంతర్జాతీయ కార్యాలయాన్ని బంగ్లాదేశ్ లో ప్రారంభించింది.

11. ఇటీవల వార్తల్లోకి వచ్చిన పంచేశ్వర్ మల్టీ పర్పస్ ప్రాజెక్ట్ (పీఎమ్పీ) భారత్, నేపాల్ దేశాలకు సంబంధించింది.

12. ఇటీవల వార్తల్లోకి వచ్చిన ‘ఓఖ్లా ‘ పక్షుల అభయారణ్యం ఉత్తర్ ప్రదేశ్ లో ఉంది.

13. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో భారత వృద్ధి రేటు 7.2 శాతానికి చేరొచ్చని ‘ఫిచ్ రేటింగ్స్’ అంచనా వేసింది.
2025-26, 2026-27 ఆర్థిక సంవత్సరాల్లో దేశ వృద్ధిరేటు వరుసగా 6.5%, 6.2 %గా నమోదు కావొచ్చని
ఫిచ్ అంచనా వేసింది.

More..

14.రెండు చేతులు లేని ఏకైక అంతర్జాతీయ పారా ఆర్చరీ ఛాంపియన్ శీతల్ దేవి.ఈమె సాధారణ ఆర్చర్లతో పోటీ పడి మరీ పతకం గెలిచింది. తన స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ‘అర్జున్’ పురస్కారం అందుకుంది.
2024, ఏప్రిల్లో జరిగిన ‘ఖేలో ఇండియా’ ఎన్టీపీసీ జాతీయ ర్యాంకింగ్ ఆర్చరీ పోటీల్లో “రజతం పతకం “గెలు చుకుని వార్తల్లో నిలిచింది.

15. S. త్రిపాఠి విశ్వేశ్వరయ్య ని కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ విశ్వవిద్యాలయానికి మొదటి డైరెక్టర్‌గా కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.

16. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటారు. 2024 థీమ్: “Yoga for Self and Society”.

17. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షల కోట్ల టర్నోవరుతో ఈ ఘనత సాధించిన తొలి భారతీయ కంపెనీగా ‘రిలయన్స్ ఇండస్ట్రీస్’ వార్తల్లో నిలిచింది.

18. విశ్వనాథన్ ఆనంద్ (2014) తర్వాత ‘క్యాండిడేట్స్ టోర్నీ’ గెలిచిన రెండో భారత ఆటగాడిగా దొమ్మరాజు గుకేష్
నిలిచాడు. పిన్న వయసులో క్యాండిడేట్స్ టోర్నీ గెలిచి, ప్రపంచ చాంపియన్షిప్ కు అర్హత సాధించిన ఆటగాళ్లలో ఈ భారత ఆటగాడు (17 ఏళ్లు) తొలి స్థానంలో నిలిచాడు.)

తెలంగాణా కరెంటు అఫైర్స్:

అంధ్ర ప్రదేశ్ కరెంటు అఫైర్స్:

1. ఏపీ నూతన డీజీపీగా సీహెచ్ ద్వారకా తిరుమలరావు 2024, జూన్ 19న నియమితులయ్యారు. ప్రస్తుతం ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా ఉన్న ఆయనను కో ఆర్డినేషన్ విభాగం డీజీపీగా నియమించిన రాష్ట్ర ప్రభుత్వం పోలీసు దళాల అధిపతిగా (హెచ్ పీఎఫ్)గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది.

 

 

వివిధ పత్రికల్లో ఛానల్ లలో వచ్చిన సమాచారం సేకరించి ఇక్కడ ఉంచడమైనది. ఏమన్నా తప్పులు ఉండివుంటే మెసేజ్ ద్వారా సూచించగలరు.

 

 

 

 

Indian constitution New challenges Notes With Questions and Answers

“Distinctive Features of Indian Federalism: Student-Friendly Question & Answers”

What are Fundamental Duties class 9-Question and Answers

What do you mean by Directive Principles of State Policy?

Understanding Fundamental Rights in the Indian Constitution – Exam Study Material

“Tribute to Sarvepalli Radhakrishnan: The Philosopher-President Who Shaped India’s Future”

What is India’s uniform civil code? History of Uniform Civil Code India and Questionnaire

“India’s G20 Leadership 2023: One Earth, One Family, One Future | G20 Summit, Sustainable Development Goals, Climate Finance, Women Empowerment”

7th schedule of constitution of India