డైలీ కరెంట్ అపైర్స్ (13 MAY 2022)
- పంజాబ్ రాష్ట్ర, అజ్ఞాల అనే ప్రాంతంలో ఒక బావిలో 282 మృతదేహాలను ఆర్కియాలజిస్టులు కనిపెట్టారు అవి 1857 సిపాయిల తిరుగుబాటుకు సంబంధించిన సైనికుల మృతదేహాలు గా వారు గుర్తించారు.
- సెక్షన్ 124A IPC -SEDITION(రాజ ద్రోహ చట్టం)
152 ఏళ్లనాటి బ్రిటిష్ కాలం నాటి 124A చట్టాన్ని నిలుపుదల చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది.
1870 లో ఈ చట్టాన్ని బ్రిటిష్ ప్రభుత్వం తీసుకు వచ్చింది.
1891 లో ఈ చట్టం పైన మొదటి కేసు నమోదు అయింది.( బెంగాల్ వీక్లీ న్యూస్ పేపర్ మంగోబాసి ఎడిటర్ పైన బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ఒక ఆర్టికల్ రాసినందుకు).
1897 లో ఈ చట్టం గురించి అందరికీ తెలిసి వచ్చింది ఎందుకంటే, స్వతంత్ర సమరయోధుడు బాల గంగాధర్ తిలక్ పైన కూడా ఈ చట్టం కి సంబంధించి కేసు వేశారు.
ఈ చట్టాన్ని ఇప్పటికీ ఆరు సార్లు సవరించారు.
1955 లో ఈ చట్టాన్ని చిట్ట చివరి సారిగా సవరించారు.
- టమాటో ఫ్లూ (TOMATO FLUE)
ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు శరీరంపైన టమాటా రంగులో ఎర్రటి దద్దుర్లు లేదా బొడిపెలు వస్తాయి.
ఇది ఒక వైరల్ డిసీజ్.
ఈ ఫ్లూ సోకిన వారు చనిపోయే అవకాశం కూడా వుంది.
ఈ టమాట ఫ్లూ కేసులు కేరళలో ,కొల్లం జిల్లాలో ఎక్కువగా నమోదయ్యాయి.
- UNCCD(United Nations convention to combat desertification.)యొక్క COP 15(conference of parties)
DROUGHT సదస్సు మే9 నుండి మే20 వరకు అబిడ్జాన్ లో జరుగుతుంది.
అబిడ్జాన్ కోట్ డీ ఐవర్ అనే దేశం లో వుంది.
ప్రపంచవ్యాప్తంగా ఎడారీకరణ ఏ విధంగా జరుగుతుంది అనే అంశంపై ఇక్కడ చర్చలు జరుగుతాయి.
1997 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 57 శాతం భూమి ఎడారి ప్రభావిత ప్రాంతంగా మారింది.
1817నుంచి 2015 వ సంవత్సరం వరకు భారతదేశంలో 23 కరువులను చూశాము.
ప్రతి సంవత్సరం కరువు కారణంగా 50 million ప్రజలు బలి అవుతున్నారు.
కరువు ప్రాంతంగా గుర్తించిన దగ్గర వర్షపాతం 750-1125 mm వుంటుంది.కానీ జాతీయం గా సగటు1183mm.
More…
- Chaaraa Bijaayi Yojanaa(చారా బిజాయి యోజన) /హర్యానా
హర్యానా రాష్ట్రంలో ఎవరైతే రైతులు వారి పొలంలో పశుగ్రాసాన్ని పండిస్తారో వారికి ఎకరానికి 10 వేల రూపాయలు ఆర్థిక సహాయం ప్రభుత్వం అందించడం ఈ యోజన యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
భారత దేశంలో మొదటి Grain ATM హర్యానా లో వుంది .
- Mission Amrit Sarover
దేశంలోని ప్రతి జిల్లాలో 75% నీటి నిల్వ వసతులు కలిగించాలి అని ఈ పథకం ఉద్దేశం.
ఈ పథకం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బాగా అభివృద్ధి చెందుతుంది.
- Marital Rape :IPC section 375
- Local body elections (స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు,)
మధ్యప్రదేశ్ లో 2019 నుండి రిజర్వేషన్ విషయంలో కొన్ని విభేదాలు ఉండడం వల్ల స్థానిక సంస్థల ఎన్నికలు జరగడం లేదు దాని గురించి సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది.
ఆర్టికల్ 243k ప్రకారం స్థానిక సంస్థలు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు తప్పనిసరిగా నిర్వర్తించాలని చెప్పింది.
- Association of Asian election authority (AAEA)
దీనికి అధ్యక్ష హోదాలో భారతదేశం 2022 నుంచి 2024 వరకు ఎన్నికయింది.
ప్రస్తుతం దీనికి అధ్యక్ష హోదాలో ఫిలిఫిన్స్ ఉంది.
- Cyber Coperative Center of Excellence wing of NATO
లో స్థానం సంపాదించిన మొట్టమొదట ఆసియాకు సంబంధించిన దేశం South Korea.
ప్రస్తుతం సౌత్ కొరియా అధ్యక్షుడు Yoon seok-youl
- హంగేరి దేశ చరిత్రలోనే మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు కేటలీన్ నోవాక్.
- ఉక్రెయిన్ మొట్టమొదటి అధ్యక్షుడు లియోనిడ్ క్రవచిక్ 13 మే 2022 న మరణించారు.
- యూరి అవర్ బ్యాక్: worlds oldest grandmaster ఈ రోజు మరణించారు.
Daily Current affairs (13 MAY 2022) in Telugu For TSPSC ,APPSC
For PDF please click here: PDF
For TSPSC Group1 notification Please visit: Notification